27, నవంబర్ 2010, శనివారం

మా అమ్మమ్మ గురించి

మా అమ్మమ్మ గురించి

శేషమ్మ మాయమ్మ శేషమ్మ అమ్మమ్మ
 శేషమ్మ నీజీవితమే భేషమ్మ
మధురాంతక వంశానికి మణిమాణిక్యానివై
తిరునగరి వంశానికి కళ్యాణతిలకమై
 రామకృష్ణునికి సహధర్మచారిణివై
 తా నొవ్వక నొప్పించక చిరునవ్వును చిందిస్తూ
తాను కష్టాలను అనుభవిస్తూ తన వారికి సుఖాలను పంచిన ఓ సాధ్వీ..
                   ఆస్తులు కన్నా అమూల్యమైన ఆత్మీయతను,అనురాగాన్ని మా అందరికి పంచి
                                                                          తిరిగిరాని లోకాలకు చేరినావు తల్లీ ...
                          నీ కీర్తిని చూసి భగవంతుడు ఈర్ష్యతో తన దగ్గరకు పిలిపించుకున్నాడు తల్లీ...
                 నీకు మరణము లేదు తల్లీ మరణము లేదు తల్లీ...
                           మరు జన్మకైన మేము నీ వారసులమే తల్లీ.