12, అక్టోబర్ 2011, బుధవారం

అందరూ అరోగ్యంగా ఉండడానికి ఒక మంచి టానిక్

 దానిపేరు చ్యవనప్రాశ్ .చ్యవన మహమహర్షి దీనిని తిని కుష్టురోగం మరియు ముసలితనం పోయి  యువకుడు అయినాడు కనుక దీనికి చ్యవనప్రాశ్ అనిపేరు.మనము కూడా దానిని సరిగ్గా తయారుచేసుకుని తిన్నట్లయితే మనకుకూడా అన్నిరోగాలనుంచి విముక్తి కలిగి పూర్తి ఆరోగ్యం వస్తుంది.మన జీవితంలో మనకి ఇక రోగాలు ఏమీ రావు.తయారుచేసే విధానము;- రాతి ఉసిరిక కాయలను 40 తీసుకొని వాటికి సూదితో కొన్ని బెజ్జాలను పొడవాలి.40 పెద్దగరిటల శ్రేష్టమైన తేనెను ఒక కొత్తకుండలో పోసి ఆ ఉసిరిక కాయలను ఆకుండలో వేసి దానిపైన పూతలేని స్వచ్చమైన గ్లాసును ఉంచి మేడమీద దానిని ఉంచాలి.ప్రతిరోజూ  రాత్రిపగలు మేడమీదనే ఉంచాలి.తెల్లవారి ఉదయాన్నే ఆకుండలో చూస్తే అక్కడ తెల్లగా నురుగు కనిపిస్తుంది.దానిని స్పూనుతో తీసివేయాలి.అలా ప్రతిరోజూ దానిని తొలగించాలి.2 లేక 3 రోజుల తరువాత ఇక ఆనురుగు రాదు.అంటే ఆ కాయలలోని చెమ్మ అంతా అయిపోయింది అని అర్ధం.ఇప్పుడు అలా ఉన్న స్వచ్హమైన దానిని గట్టిగా గాలికూడాఅడని విధంగా సీలు వేయాలి.ఆ తరువాత దానిని భూమిలో 6 అడుగుల లోతున పూడ్చాలి.అలా 40 రోజులు భూమిలోనే ఉంచాలి.ఆ తరువాత దానిని భూమిలోనుంచి పైకి తీయాలి.తరువాత ప్రతిరోజూ దానిలోంచి ఒక ఉసిరక కాయని తీసుకొని దానితోపాటే ఆకుండలోనుంచి ఒక గరిట పరిమితిలో   తేనెను కూడా తీసుకొని పొద్దున్నే పరగడుపున తినాలి.ఇలా ఆ కుండలోంచి 40 రోజులవరకూ తినాలి.అప్పుడు మనలో ఉన్న అన్ని రోగాలూ పోవడమే గాక మంచి ఆరోగ్యంతో మనము ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా ఉండగలము.ఇది చ్యనన ప్రాశ్ తయారుచేసే విధానము.ఏ కంపినీ కూడా ఇలాగ తయారుచేయదు.కాబట్టి మనమే ఈ విధంగా తయారుచేసుకుని వాడితే చాలా