కంపూటర్స్


క్రొత్త ఫీచర్లతో TeamViewer 6 బీటా విడుదల!!!



ప్రముఖ రిమోట్ అడ్మినిస్ట్రేషన్/ షేరింగ్ టూల్ అయిన TeamViewer ఇప్పుడు క్రొత్త ఫీచర్లతో 6 బీటా వెర్షన్ ని విడుదల చేసింది. మెరుగైన ఫెర్ఫార్మెన్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ లో మార్పులు, మెరుగైన Quick Custom Support, క్రొత్త QuickJoin మాడ్యుల్, బెటర్ సెక్యూరిటీ, రీబూట్ తో ఆటోమాటిక్ రీకనెక్ట్ మొదలగునవి ఈ వెర్షన్ లో ప్రధానం.



QuickJoin ఫీచర్ తో ఆన్‌లైన్ మీటింగ్స్/ కాంఫరెన్సెస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ ప్రెజెంటేషన్లు యివ్వవచ్చు.

మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు TeamViewer సైట్ చూడండి.


డౌన్లోడ్: TeamViewer


FreeVideoConverter - వీడియోలను ఒక ఫార్మేట్ నుండి వేరొక ఫార్మేట్ లోకి మార్చటానికి, బర్న్ చెయ్యటానికి, యూట్యూబ్ కి అప్‌లోడ్ చెయ్యటానికి ఇంకా చాలా...

FreeVideoConverter - ఒక శక్తివంతమైన వీడియో కన్వర్టర్. దీనిని ఉపయోగించి వీడియోలను ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చవచ్చు. AVI, MP4, MKV, WMV, MPG, 3GP, 3G2, SWF, FLV, TOD, MOV, DV, RM, QT, TS, MTS ఇలా 200 పైగా వీడియో ఫార్మేట్లను AVI, WMV, MP4, MKV, SWF, MPG, 3GP, MP3 ఫార్మేట్ లోకి మార్చవచ్చు. అంతేకాకుండా వీడియో ఫైళ్ళను డీవీడీ లోకి బర్న్ చెయ్యవచ్చు, వీడియోలను యూట్యూబ్ కి అప్‌లోడ్ చెయ్యవచ్చు, వీడియో ఫైళ్ళను MP3 లోకి మార్చవచ్చు, ఫోటోలను వీడియో స్లైడ్ షో గా మార్చవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా ( cut, rotate,లేదా join).



మరింత సమాచరం కోసం freemake.com సైట్ చూడండి.


డౌన్లోడ్: Free Video Converter 

ధన్యవాదాలు







PDFRider - పీడీఎఫ్ ఫైళ్ళను Merge, Split, Rotate మరియు Edit చెయ్యటానికి!!!

PDFRider - ఒక ఉచిత పీడీఎఫ్ ఎడిటింగ్ సాప్ట్‌వేర్. దీనిని ఉపయోగించి పీడీఎఫ్ ఫైళ్ళను మెర్జ్ చెయ్యవచ్చు మరియు విడగొట్టవచ్చు, పేజీలను కలపవచ్చు మరియు తొలగించవచ్చు, పేజీలను రొటేట్ చెయ్యవచ్చు అంతేకాకుండా సెక్యూరిటీ కోసం encrypt మరియు decrypt చేసే సదుపాయం కూడా కలదు.



PDFRider ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత మెయిన్ మెనూ లోని టూల్స్ పై క్లిక్ చెస్తే పైన చెప్పిన ఆప్షన్లు వస్తాయి.


డౌన్లోడ్: PDFRider 


Avert - మల్టిపుల్ యాంటీవైరస్ ఇంజిన్స్ తో పీసీ ని స్కాన్ చెయ్యటానికి!!!

వైరస్ కానీ, మాల్వేర్, స్పైవేర్, రూట్ కిట్ ఇలా ఏదైనా కానీ మన పీసీ లోని డాటా లేదా ఇన్ఫర్మేషన్ కి హాని చేసేవే. వీటితో ఇన్ఫెక్ట్ అయిన పీసీ లను సమర్ధవంతంగా తొలగించటానికి ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ యాంటీ-వైరస్ సాప్ట్ వేర్ల పై ఆధారపడుతూ ఉంటాం. ఒకటికంటే ఎక్కువ యాంటీ-వైరస్ సాప్ట్ వేర్లు ఒకే పీసీ ఇనస్టలేషన్ చెయ్యటం వలన ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులకు గురిఅవుతూవుంటాం. వారి కోసమే Avert - ఇది ఉచిత పోర్టబుల్ టూల్, దీనిలో 8 వరకు వివిధ యాంటీ వైరస్ ఇంజిన్స్ ఉన్నాయి, అవి వైరస్, ట్రోజన్ వార్మ్ వేటినైనా సమర్ధవంతంగా తొలగిస్తాయి. అంతేకాకుండా దీనిలో CCleaner కూడా ఉంది.


AVERT comes loaded with tons of features and more are constantly added:
  • Use up to 8 Portable scanners from some of the top security companies
  • Supports 1 installed scanner, AVG, but more are on the way
  • Automatic EVERYTHING - Scanning, logging, quarantine/removal
  • Simple and easy to use
  • Customizable
  • Auto updates
  • Temp file cleaning with Piriform's CCleaner
  • Registry backups
  • Additional tools to help resolve issues caused by malware
  • FREE and always will be

డౌన్లోడ్: Avert







Kaspersky Rescue Disk - పీసీ నుండి వైరస్ లను తొలగించటానికి ఒక సురక్షిత మార్గము!!!

మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన యాంటీ-వైరస్ సాప్ట్ వేర్లు లేదా మరి ఏ యితర సాప్ట్ వేర్లు వైరస్ లను తొలగించటం లో విఫలమైనప్పుడు ఇన్ఫెక్టెడ్ పీసీ ని Kaspersky Rescue Disk తో బూట్ అవ్వడం వలన ఆ పీసీ లోని త్రెట్స్ ని సమర్ధవంతంగా తొలగించవచ్చు. ముందుగా Kaspersky Rescue Disk ISO ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఒక CD లో బర్న్ చేసుకోవాలి. bootable USB disk కి కూడా టూల్ దొరుకుతుంది. ఈ CD ని ఇన్ఫెక్టెడ్ సిస్టం సీడీ-రామ్ డ్రైవ్ లో ఉంచి, పీసీ BIOS లో Boot from CD ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని సిస్టం రీబూట్ చెయ్యాలి. Kaspersky Rescue Disk ఉపయోగించటం కూడా చాలా సులువు, ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది వైరస్ స్కానింగ్ ఇంటర్‌ఫేస్ నే కలిగి ఉంటుంది.



అవసరమైతే స్కాన్ చేసేముందు My Update Centre టాబ్ కి వెళ్ళి Kaspersky Rescue Disk డాటాబేస్ ని అప్‌డేట్ చేసుకోవాలి. మరింత సమాచారం కోసం Kaspersky సైట్ చూడండి.

డౌన్లోడ్: Kaspersky Rescue Disk

ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ BitDefender Rescue CD

PortableApps Suite
A collection of apps preconfigured to work portably.
TreeSize Free
Tells you where precious space has gone to.
TrueCrypt
Free open-source, cross-platform disk encryption software.
EASEUS Partition Master
Freeware is an all-in-one partition solution.










2. మాల్వేర్/ స్పైవేర్ రిమూవల్స్:











































































Spybot S&D
Detects and removes spyware. Compliments anti-virus apps.
Malwarebytes’ Anti-Malware
Easy-to-use, simple, and effective anti-malware application.
IObit Security 360 Free
Advanced malware & spyware removal utility.
















































































































Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM
5 నిమిషాల్లో కొన్ని వందల నుండి వేల మందికి SMSలు పంపాలనుకుంటున్నారా?
రకరకాల సర్వీసుల నుండి మనకు వచ్చే Bulk SMSలు అస్సలు ఎలా పనిచేస్తాయి.. మీరూ ఓ బెస్ట్ పద్ధతిని ఎంచుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
పండగలప్పుడూ మీ ఆత్మీయులందరికీ విషెస్ తెలపడానికీ.. మీ వ్యాపార అవసరాలకు కస్టమర్లతో టచ్‌లో ఉండడానికీ, ఇంకా పలు రకాలుగా ఉపయోగపడే Bulk SMS Gatewayల గురించి వివరంగా ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
SMSలు పొందడమే తప్ప అంత భారీ మొత్తంలో ఎలా పంపుతారో తెలీని వారికి ఈ వీడియో అవగాహన కలిగిస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

సరుకులు కొనడానికి కిరాణా స్టోర్‌కి వెళ్లే టైమ్ కూడా లేదా? అయితే ఇది బెస్ట్ సొల్యూషన్ Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM
ఇంటి, ఆఫీస్ పనులతో బిజీ బిజీగా ఉండే వాళ్లు పనిగట్టుకుని మరీ కిరాణా షాప్‌కి వెళ్లి సరుకులు కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది.
కొన్ని కిరాణా షాపుల వాళ్లు ఫోన్‌లో ఆర్డర్ తీసుకుని హోమ్ డెలివరీ ఇస్తున్నా ఆయా సరుకుల క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలీదు. తీరా ఆర్డర్ ఇచ్చి వస్తువులు వచ్చాక చీప్ క్వాలిటీతో ఉన్నాయని బాధపడుతుంటాం.
ఇలాంటి సమస్యలు అన్నింటికీ ఓ మంచి పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించాను. ఇందులో చూపించిన ఆన్‌లైన్ సూపర్ మార్కెట్లో బియ్యం దగ్గర్నుండీ, కూరగాయలూ, పళ్లూ, పేస్ట్‌, షాంపూల వంటి అన్ని వస్తువుల క్వాలిటీని ఫొటోల్లో చూసి ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు.
బయట షాపుల్లో ఉన్న ధరల కన్నా కొద్దిగా చవక ధరలు కూడా పొందొచ్చు.
గమనిక: టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu

మీకుVote హక్కు లేదా? అయితే ఇలా ఆన్‌లై‌న్‌లో పొందండి.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://bit.ly/srivoterid
పెరిగే పెట్రోలు, నిత్యావసరాల ధరలూ, రూపాయి పతనం వంటి అనేక సమస్యలకు పెద్ద పెద్ద గొంతులేసుకుని ప్రభుత్వాల్ని నిందిస్తే సరిపోదు.
మనం సినిమా థియేటర్ల ముందు క్యూల్లో నిలబడేటంత patience ఐదేళ్లకు ఓసారి ఓట్ వెయ్యడానికి పెట్టకపోవడం వల్లే దేశంలో ఇన్ని సమస్యలు.
ఇప్పటికీ చాలామంది యువతకు ఓటు హక్కులేదు. ఎక్కడికెళ్లి ఓటుహక్కు రిజిస్టర్ చేసుకోవాలో తెలీక అస్సలు ఓటే వెయ్యని వాళ్లెందరో!
అలాంటి వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా పనికొస్తుంది. మీ ఇంటి గుమ్మం కదలకుండానే మీ పిసి నుండే మీకు ఓటు హక్కుని పొందొచ్చు.. మీ ఓటుతో ఈ అవినీతి ప్రభుత్వాల్నీ, నాయకుల్నీ రాయల్‌గా నిలదీయొచ్చు…
ఓటు హక్కు ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవడానికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో మిస్ అవకుండా షేర్ చెయ్యగలరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు
వీడియో లింక్ ఇది: http://bit.ly/srivoterid
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

గ్యాస్ సిలెండర్‌ అన్ని సేవలూ ఆన్‌లైన్‌లో ఇలా.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://bit.ly/srigas
మీరు ఇంట్లో లేని సమయంలో సిలెండర్ డెలివరీకి వచ్చి.. డోర్ లాక్ చేసి ఉందని వెనక్కి తీసుకు వెళితే… గ్యాస్ ఏజెన్సీకి వచ్చి తీసుకెళ్లమని చెప్తే ఎలా ఉంటుంది? మీ ఆఫీస్ సెలవులకు అనుగుణంగా మీరు కోరుకున్న వారం, సమయాల్లో సిలెండర్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుసా?
ఫోన్ ద్వారా సిలెండర్ బుక్ చేసిన తర్వాత మీ బుకింగ్ ఆర్డర్ ఓ 10 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా కేన్సిల్ చెయ్యబడితే మీకు ఎలా ఉంటుంది?
మీ గ్యాస్ ఏజెన్సీ సరైన సేవలు అందించకపోతే ఏ విషయంపై అయినా ఆన్‌లైన్‌లో కంప్లయింట్లు ఇవ్వొచ్చని తెలుసా?
ఈ వీడియో చూస్తే మీ గ్యాస్ కష్టాలు చాలావరకూ తీరిపోతాయి.
గ్యాస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srigas
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

10th క్లాస్ సర్టిఫికెట్ పోయిందా? వర్రీ అవకండి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://bit.ly/sri10thclass
లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో 10th క్లాస్ మార్కుుల లిస్ట్ అతి ముఖ్యమైనది. ఇది Date of Birthకి ప్రూఫ్‌గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.
సో ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా ఈ వీడియోలో మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది.
అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్‌ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sri10thclass
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ Gmail మెయిల్స్ పర్మినెంట్‌గా పోయాయా? ఇలా తిరిగి తెచ్చుకోండి Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://bit.ly/srigmaildelete
ముఖ్యమైన mails డిలీట్ అయిపోతే ఆ నష్టం ఊహించలేనిది. నన్ను తరచూ  “Gmail Inbox పొరబాటున ఖాళీ అయిపోయిందనీ”, “పొరబాటున చాలా ఇంపార్టెంట్ మెయిల్స్ డిలీట్ చేశామనీ… వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎలాగని” చాలామంది అడుగుతుంటారు.
ప్రతీ ఒక్కరూ ఎప్పుడోసారి ఎదుర్కొనే ఈ సమస్యకి అద్భుతమైన పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.
మీ మెయిల్స్ పోయిన వెంటనే ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే 99.99% అవి తిరిగి పొందే అదృష్టం ఉంది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఖచ్చితంగా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srigmaildelete
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ ఫోన్‌ని కాపాడడానికి కొత్తగా ఏ సాఫ్ట్‌వేర్ అవసరం లేదు.. ఇలా చేయండి! Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://bit.ly/srianti-theft
మీరు ఏ మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఫర్లేదు.. అది దొంగిలించబడినప్పుడు దాన్ని సులభంగా వెదికి పట్టుకునే పలు శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ల  గురించి గతంలో వివరించాను.
ఇలా వేరే సాఫ్ట్‌వేర్లు ఏమీ అవసరం లేకుండా మీ ఫోన్‌ని వెదికి పట్టుకునే అవకాశం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.
మీ ఫోన్‌లోనూ  ఇది లభిస్తున్నా మీకు తెలీకపోవడం వల్ల ఎనేబుల్ చేసుకుని ఉండకపోవచ్చు. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఫోన్ పోతే ఎలా track చెయ్యాలి అన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా వివరించాను.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srianti-theft
ఈ వీడియోలో చూపించిన దాని కన్నా మరింత విస్తృతంగా, శక్తివంతంగా పనిచేసే మరో పద్ధతిని ఈ లింకులో చూడొచ్చు.. Your Phone will never Lost – Extraordinary Anti-Theft software
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? డ్రైవింగ్ లైసెన్స్ Slot మీరే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి ఇలా..


వీడియో లింక్ ఇది:  http://bit.ly/sridriving
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలామంది దళారుల మీద ఆధారపడుతుంటారు. ఎంతో కొంత ముట్టజెప్పి టెస్ట్‌లకు హాజరవుతుంటారు.  ఈ వీడియోలో నేను చూపించినట్లు ఫాలో అయితే ఎవరిపై depend అవ్వాల్సిన పనిలేకుండా నేరుగా మీరు లెర్నర్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్ టెస్టుల slotలను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.
బ్రోకర్ల ద్వారా వెళితే లైసెన్స్ త్వరగా వస్తుందన్న ఓ అపోహ చాలామందిలో ఉంది. అయితే ఈ పద్ధతి ఫాలో అయితే వాళ్ల ద్వారా వెళ్లినా, మనం ఇలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని నేరుగా వెళ్లినా ఒకటే అని అర్థమవుతుంది.
గమనిక: టూవీలర్, కార్ డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sridriving
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి టిక్కెట్లు మీ పిసి నుండే బుక్ చేసుకోవడం ఇలా… Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets
ముందుగా ఈ రకంగానైనా తిరుమల శ్రీవారిని సేవించుకోవడం అదృష్టంగా భావించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను..
శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి TTD కేంద్రాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా నేరుగా మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి, కళ్యాణోత్సవం, నిజపాద దర్శనం, తోమాల సేవ వంటి వివిధ సేవల టిక్కెట్లని ఎంత సులభంగా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.
ఏమీ ప్లాన్ చేసుకోకుండా అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది.  అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి టిక్కెట్లు దొరికే తేదీల్ని పరిశీలించుకుని మీకు అనువుగా ఉన్న తేదీన టిక్కెట్లు బుక్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు ప్రింటౌట్లు తీసుకుని వెళితే ఎలాంటి అసౌక్యరం లేకుండా శ్రీవారి దర్శనం సుఖవంతంగా ఉంటుంది.
గమనిక: శ్రీ వేంకటేశ్వరుని కొలిచే ప్రతీ భక్తునికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేయడం ద్వారా వారికి స్వామి వారి దర్శనభాగ్యం కలగడానికి మీ వంతు సహకరించగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ ఆధార్ కార్డ్‌లో మార్పులు చేసుకోవాలా? చాలా ఈజీ! Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://bit.ly/sriaadhaarupdate
ఆధార్ కార్డ్ పేరు చెప్తేనే గంటల తరబడి ఎన్‌రోల్‌మెంట్ల కోసం క్యూలో నిలబడ్డ మూమెంట్సో.. అలా నిలబడలేక 200 ఇచ్చి త్వరగా పనికానిచ్చుకున్న విషయమే గుర్తొస్తుంది కదా :)
ఒక్కసారి మీ ఆధార్ కార్డులో తప్పులు వస్తే, లేదా అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి మార్చుకోవలసి వస్తే మళ్లీ మళ్లీ ఇ-సేవ, ఇతర ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా ఈజీగా మీ కంప్యూటర్ నుండే క్షణాల్లో మీ పేరూ, పుట్టిన తేదీ, చిరునామా వంటి అన్ని వివరాల్నీ క్షణాల్లో మార్చుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులందరితోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriaadhaarupdate
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

Subscribe

Follow Here

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Subscribe Here

Be touch in Google+

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి