ఒకప్పుడు ఆంగ్లాన్ని ఎక్కువగా ద్వేషించే చైనాలో తరువాత తమ తప్పును తెలుసుకొని ఇంగ్లీషును నేర్చుకొని ఐటీలో అగ్రగామిగా భవిష్యత్తులో ఉండాలనే ధ్రుఢసంకల్పంతో 2 సంవత్సరాలక్రితం మన ఆంధ్రాలోని గురుకుల పాఠశాలలవలే 10,000 పాఠశాలలను స్థాపించి వాటిలో ఇంగ్లీషు నేర్పడం ప్రారంభించారు.రాబోయే 2 సంవత్సరాల తరువాత ఒక పాఠశాలకు కనీసం 50 మందిని తీసుకున్నా 5 లక్షలమంది ఐటిలో మన ఇండియాకు పోటీగా వస్తారు.ఒక పాఠశాలకు 100 మందిని తీసుకుంటే 10 లక్షల మంది మనకు పోటీగా ఐటీలో నిలుస్తారు.కాబట్టి ఈలోపే మనవారిని ఇంగ్లీషులో మరియు భావవ్యక్తీకరణలో నైపుణ్యంకలిగేట్లు చేస్తే అప్పుడు రాబోయేకాలంలో చైనానుంచి వచ్హే పోటీని తట్టుకుని ఐటీలో ఉద్యోగాలు మనవారు పొందుతారు.లేకపోతే ఇప్పటికే మనవాళ్ళు కొంతమంది సరైన ఆంగ్ల పాండిత్యంలేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.దీనికితోడు మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లుగా చైనావాళ్ళుకూడా మనకు ఉద్యోగాల్లో పోటే వస్తే మనవాళ్ళకు ఉద్యోగాలు దొరకడం చాలాకష్హ్తమౌతుంది.ముందుగా మన ఆంధ్రావాళ్ళు అందరికీ ఉద్యోగాలు తప్పనిసరిగా రావాలంటే ఇంగ్లీషు భాషలో నైపుణ్యం తప్పనిసరి.ఆ ఉద్దేశ్యంతో నేను ఇక్కడ ఈ వెబ్ సైటులో ప్రతిఒక్కరూ ప్రతిరోజూ ఒక్కగంట సమయం కేటాయిస్తే కేవలం 3 నెలల్లోనే ఒక అమెరికన్ లాగా ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటానికి కావలసిన స్పోకెన్ ఇంగ్లీషు పాఠాలను రోజూ పొందుపరుస్తున్నాను.కాబట్టి అందరూ ఈ వెబ్ సైటులోని ఫాఠాలను నేర్చుకొనగలరు. మరియు మీస్నేహితులకు SMS ద్వారా తెలియచేసి వారుకూడా ఆంగ్లములో నైపుణ్యం పొందడానికి సహకరించగలరు. ఈ రూపేణా మనము మనదేశానికి సేవచేద్దాము.websites...