ఆరోగ్యం


ఆరోగ్యానికి సంబంధించిన ఇంటరాక్టివ్ ట్యుటోరియళ్ళు…

ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇంటరాక్టివ్ ట్యుటోరియళ్ళ లింక్స్ ఇక్కడ యిస్తున్నాను… ఇవి అవగాహన కోసం మాత్రమే… గమనించగలరు.
Diseases and Conditions
Tests and Diagnostic Procedures
Prevention and Wellness
ధన్యవాదాలు




కొవ్వు ను తగ్గించే 12 గుడ్ ఫుడ్స్
'నీకేం గుండ్రాయిలా ఉన్నావ్' అని పిలిపించుకునే రోజులు కావివి. మూడు పదులకే ఒబేసిటీ, కొలెస్ట్రాల్, షుగర్, బ్లడ్‌ప్రెజర్ రిపోర్టుతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనికి కారణం తెలుసా...? గతి తప్పిన ఆహారపు అలవాట్లు. శృతి తప్పిన జీవనశైలి. అందుకే మీ డైలీ మెనూలో కొవ్వును తగ్గించే ఈ 12 ఉండేలా చూసుకుంటే... జీవితం హాయిగా సాగిపోతుంది...
పసుపు 




 
రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో డెన్సిటీ లిపొప్రొటైన్' (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసు
 రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.


యాలకులు :


తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.


మిరప:  

వీటిని (ఆహారంలో భాగంగా) తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.


కరివేపాకు : 
 


బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే. 

వెల్లుల్లి :
ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. 

అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

ఆలివ్ ఆయిల్ : 
 




వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

 


క్యాబేజీ :  


బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు.

పెసరపప్పు :
 


కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు.

తేనె :
 


మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.



మజ్జిగ : 



గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు దొరుకుతాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.
సజ్జలు : 
 




అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది.
చెక్కా లవంగాలు :
 




ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి.



ఇవన్నీ మీ డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు. 



కొలెస్ట్రాల్ పెరిగితే కష్టాలే...!






ప్రొటీన్ల మాదిరిగానే కొలెస్ట్రాల్ కూడా శరీరంలో ఒక కాంపోనెంట్‌గా ఉంటుంది. కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, హార్మోన్ల తయారీకి ఇది సహాయపడుతుంది. కానీ కొలెస్ట్రాల్ శాతం పరిమితిని మించినపుడు మాత్రమే దీర్ఘకాలంలో శరీరానికి హాని జరుగుతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ సెల్ మెంబ్రేన్ ల తయారీ, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఆండ్రోజన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల తయారీలోనూ పాలుపంచుకుంటుంది. అడ్రినల్ గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్ల తయారీకి కూడా కొవ్వు చాలా అవసరం. విటమిన్ డి తయారీలోనూ కొలెస్ట్రాల్ పాత్ర ఉంటుంది. కొలెస్ట్రాల్‌లో మూడు రకాల లైపోప్రొటీన్స్ ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తీసుకెళతాయి.

ఎల్‌డీఎల్(లో డెన్సిటీ లైపోప్రొటీన్) :

ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది కాలేయం నుంచి కణాలకు కొలెస్ట్రాల్‌ను తీసుకెళుతుంది. ఒకవేళ కొలెస్ట్రాల్‌ను ఎక్కువ తీసుకెళితే కణాలు ఎక్కువ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఈ ఎల్‌డీఎల్ లెవెల్స్ బాగా పెరిగితే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

హెచ్‌డీఎల్(హై డెన్సిటీ లైపోప్రొటీన్) : 


 ఇది మంచి కొలెస్ట్రాల్. ఇది పెరిగిపోతున్న ఎల్‌డీఎల్‌ను తొలగిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటాన్ని నివారిస్తుంది. ఇది ఎల్‌డీఎల్‌కు విరుద్దంగా పనిచేస్తుంది. కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను కాలేయంకు చేరుస్తుంది. కణాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూడటమే దీని విధి.

ట్రైగ్లిసరైడ్స్ :  

ఇవి ప్లాస్మాలో ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్‌తో కలిసి ప్లాస్మా లిపిడ్స్(బ్లడ్ ఫ్యాట్)గా మారుతుంది. తీసుకునే ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల, కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ తయారవుతుంటాయి. తీసుకున్న క్యాలరీలు వెంటనే ఖర్చు కానప్పుడు కణాలు వాటిని ట్రైగ్లిసరైడ్స్‌గా మార్చి కొవ్వు కణాలలో నిల్వ చేస్తాయి. శరీరానికి శక్తి అవసరమయినపుడు, ఆహారం అందనపుడు కొవ్వు కణాలు ట్రైగ్లిసరైడ్స్‌ను విడుదల చేసి శక్తిని తయారుచేసుకుంటాయి. ఈ ప్రక్రియను హార్మోన్లు నియంత్రిస్తుంటాయి.

కొలెస్ట్రాల్ లెవెల్స్

కొలెస్ట్రాల్ 200 ఝజ/ఛీఔ కంటే తక్కువ.

హెచ్‌డీఎల్ ( గుడ్ కొలెస్ట్రాల్) 35 కంటే ఎక్కువ.

ఎల్‌డీఎల్ (బ్యాడ్ కొలెస్ట్రాల్) 130 కంటే తక్కువ.

ట్రైగ్లిసరైడ్స్ 150 కంటే తక్కువ.



కొలెస్ట్రాల్ పెరిగితే...

కొలెస్ట్రాల్ పెరిగితే దీర్ఘకాలంలో రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కారణాలు?

వయస్సు, కుటుంబ చరిత్ర, పొగతాగే అలవాటు, అధిక రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్ తదితర అంశాలన్నీ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంటాయి. అంతేకాకుండా జన్యుపరమైన కారణాలు కూడా కొలెస్ట్రాల్ పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. జీవనవిధానం, ఆహార నియమాలు, వేపుళ్లు ఎక్కువగా తినడం కూడా కారణమవుతుంది.

రిస్క్ ఎవరికి ఎక్కువ

వంశపారపర్యంగా గుండె జబ్బులు వస్తున్న వారిలో, డయాబెటిస్ ఉన్న వారికి, థైరాయిడ్ సమస్య ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ.




పెరిగితే ఏం చేయాలి?

ముందుగా ఏ కారణం చేత కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. అధిక బరువు ఉన్నట్లయితే తగ్గించుకోవడం, డయాబెటిస్ ఉన్నట్లయితే నియంత్రించుకోవడం చేయాలి. «థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే దానికి సంబంధిచిన చికిత్స తీసుకోవడం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరవద్దు. కొవ్వు తక్కువగా ఉండే ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. మాంసాహారంకు దూరంగాఉండాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.
పరీక్షలు

లిపిడ్ ప్రొఫైల్ అనే రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉన్నదీ తెలుసుకోవచ్చు. పరగడపున రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. శాంపిల్ ఇచ్చే ముందు 9నుంచి 12 గంటల ముందు ఆహారపానీయాలు ఏమీ తీసుకోకూడదు. 40 ఏళ్లు లోపు ఉన్న వారు ఆరునెలలకొకసారి, 40ఏళ్లు పైబడిన వారు 3 నుంచి 6 నెలలకొకసారి, డయాబెటిస్, థైరాయిడ్ సమస్య ఉన్న వారు రెగ్యులర్‌గా పరీక్ష చేయించుకోవాలి.




చికిత్స

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల టౌటఠఠ్చిట్ట్చ్టజీn అనే మందు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల మంచి ఫలితం ఉంటోంది. మందుల వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ 10 శాతం పెరిగే అవకాశం ఉంది. nజ్చీఛిజీn అనే మందులు కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ బ్యాండింగ్ డ్రగ్స్ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపకరిస్తాయి.




బలాన్ని ఇచ్చే బాదం








బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం.


ఎలా వాడితే మంచిది?
వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.




బాదంపాలు:


బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. 





మంచి టానిక్‌: 
బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.




కొన్ని సూచనలు: 


ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.





అలవాట్లు

ఒక వ్యక్తి యొక్క అలవాట్లు అతన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిందిఆహారపు అలవాట్లు గురుంచి. చక్కని పోషకాహారాలు గల ఆహారాన్ని తీసుకొంటే, చక్కని  ఆరోగ్యం  చేకూరుతుందని  తెలుసుకోవాలి. మీరు  గుర్తుంచుకోవలసిన విషయం  ఏమిటంటే మీరు మీ  శరీరాన్ని  పోషించుకోవాలి,  వ్యర్థ పదార్ధాలతో  పాడుచేసుకోరాదు. చాలామంది  ఇది గమనించని విషయం.  జల్సాలకు పోయి, మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకొంటున్నాం.సరదాగా మొదలుపెట్టి, మెల్ల, మెల్లగా తమ అలవాట్లకి బానిసలు అవుతుంటారు. ఒక్కోసారి ప్రమాదకరమైన అలవాట్లకు బానిసలయి తమ జీవితాన్నే పాడుచేసుకొనేవారు ఉన్నారు. కాబట్టి మన ఆరోగ్య విషయం లో మనం జాగ్రత్త వహించాలి.

దానిపేరు చ్యవనప్రాశ్ .చ్యవన మహమహర్షి దీనిని తిని కుష్టురోగం మరియు ముసలితనం పోయి  యువకుడు అయినాడు కనుక దీనికి చ్యవనప్రాశ్ అనిపేరు.మనము కూడా దానిని సరిగ్గా తయారుచేసుకుని తిన్నట్లయితే మనకుకూడా అన్నిరోగాలనుంచి విముక్తి కలిగి పూర్తి ఆరోగ్యం వస్తుంది.మన జీవితంలో మనకి ఇక రోగాలు ఏమీ రావు.తయారుచేసే విధానము;- రాతి ఉసిరిక కాయలను 40 తీసుకొని వాటికి సూదితో కొన్ని బెజ్జాలను పొడవాలి.40 పెద్దగరిటల శ్రేష్టమైన తేనెను ఒక కొత్తకుండలో పోసి ఆ ఉసిరిక కాయలను ఆకుండలో వేసి దానిపైన పూతలేని స్వచ్చమైన గ్లాసును ఉంచి మేడమీద దానిని ఉంచాలి.ప్రతిరోజూ  రాత్రిపగలు మేడమీదనే ఉంచాలి.తెల్లవారి ఉదయాన్నే ఆకుండలో చూస్తే అక్కడ తెల్లగా నురుగు కనిపిస్తుంది.దానిని స్పూనుతో తీసివేయాలి.అలా ప్రతిరోజూ దానిని తొలగించాలి.2 లేక 3 రోజుల తరువాత ఇక ఆనురుగు రాదు.అంటే ఆ కాయలలోని చెమ్మ అంతా అయిపోయింది అని అర్ధం.ఇప్పుడు అలా ఉన్న స్వచ్హమైన దానిని గట్టిగా గాలికూడాఅడని విధంగా సీలు వేయాలి.ఆ తరువాత దానిని భూమిలో 6 అడుగుల లోతున పూడ్చాలి.అలా 40 రోజులు భూమిలోనే ఉంచాలి.ఆ తరువాత దానిని భూమిలోనుంచి పైకి తీయాలి.తరువాత ప్రతిరోజూ దానిలోంచి ఒక ఉసిరక కాయని తీసుకొని దానితోపాటే ఆకుండలోనుంచి ఒక గరిట పరిమితిలో   తేనెను కూడా తీసుకొని పొద్దున్నే పరగడుపున తినాలి.ఇలా ఆ కుండలోంచి 40 రోజులవరకూ తినాలి.అప్పుడు మనలో ఉన్న అన్ని రోగాలూ పోవడమే గాక మంచి ఆరోగ్యంతో మనము ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా ఉండగలము.ఇది చ్యనన ప్రాశ్ తయారుచేసే విధానము.ఏ కంపినీ కూడా ఇలాగ తయారుచేయదు.కాబట్టి మనమే ఈ విధంగా తయారుచేసుకుని వాడితే చాలా బాగుంటుంది.ఈ విషయాన్ని నేను ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుని దగ్గర తెలుసుకొన్నాను.కాబట్టి అందరూ స్వంతముగా తయారు చేసుకొని వాడి ప్రయొజనం పొందండి.
----------------------------------------------------------------------------------------------------------------------------
మన కంటి చూపు బాగా ఉండాలంటే.....
చిన్నపిల్లలు,యువకులు, పెద్దలు ఇలా అందరూ ఎక్కువగా చదవడం వల్లగానీ,కంప్యూటర్ ముందు ఎక్కువ పని చేయడంవల్లగానీ మన కంటిచూపు మందగిస్తుంటుంది.షోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలను పెట్టుకోవాల్సివస్తున్నది.ప్రస్తుతము కళ్ళజోళ్ళు లేనివారు సైతం కొద్దికాలానికల్లా వాటిని ధరించవలసి వస్తుంది.మనము తినే అహారంలో మన కళ్ళు బాగా పనిచేయడానికి కావాల్సిన పోషక విలవలు లేవు.మనము ఆ పోషకాలేమిటో తెలుసుకొని వాటిని కనీసం 2 నెలలు తీసుకుంటే సరిపోతుంది.ద్రుష్టి దోషం ఉండదు.అవి ఏవి అంటే 1) జీడీలు 2) కారెట్ దుంపలు 3)ఆకు కూరలు  ....నువ్వులుకలిసిన బెల్లపు ఉండలను జీడీలని కృష్ణాజిల్లాలో పిలుస్తారు.అవి ఇక్కడ కూడా (హైదరాబదులోకూడా) దొరుకుతాయి.వాటిని  పొద్దున సాయంకాలము చొప్పున ప్రతిరోజూ 2 తినాలి. కారెట్ దుంపలను  ప్రతిరోజూ  5 తినాలి. లేదా పొద్దున ,సాయంకాలము కారెట్ జ్యూస్ ను ప్రతిరోజూ 40 దినాలపాటు  తాగాలి.మరియు  తోటకూర, బచ్హలి ఆకు, పెరుగుతోటకూర,గోంగూర,మెంతికూర  ఇలాంటి ఆకు కూరలు  మన ఆహారంలో బాగా ఉండేట్టు చూసుకోవాలి.ఇలా ఈ మూడింటిని  పైన చెప్పినట్లుగా ప్రతిఒక్కరూ 2 నెలలపాటు తీసుకుంటే అప్పుడు మనకు కళ్ళజోళ్ళు ధరించవలసిన  దౌర్భాగ్యం రాదు. ఇప్పటికే కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నవారు ఇక వాటిని ధరించవలసిన అవసరం ఉండదు.ఈవిధంగా  మన అహారపు అలవాట్లను సరిచేసుకోనుటద్వారా మనము మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్హును.

అందరికీ 65వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.ఈరోజు మనము స్వీట్లు పంచుకునేది మనకోసం తమ సర్వస్వాన్ని త్యాగంచేసిన నాటి స్వాతంత్ర్యవీరులను గుర్తు చేసుకోవడానికే.దానివలన మనకు గొప్ప ఇన్స్పిరేషన్ కలుగుతుంది.అలాంటి మహాను భావులను ఆదర్శంగా తీసుకోవడంవలన వారు చేసినన్ని గొప్పపనులు మనము చేయకపోయినా వాటిలో   కోన్నయినా చేయడానికి వీలవుతుంది.నాటి స్వాతంత్ర్యపోరాటంలో వున్న  దేశసేవా ద్రుక్పధం,మాత్రుదేశ భక్తి,నిస్వార్ధం,పరోపకార పరాయణత్వం,సంఘటితశక్తి, సర్వమత ఐకమత్యం నేడు మనకు కనపడదు.మనపూర్వీకులు చాలామంది దేశభక్తులు ఉండేవారు.నేడు చాలామంది దేశభోక్తలు ఉన్నారు.నాడు మనలను తెల్లవాళ్ళు పరిపాలించారు.నేడు మనలను నల్లవాళ్ళు పరిపాలిస్తున్నారు.రంగుమారింది.అంతే .దోపిడీ మామూలుగానే ఉంది. నేడు ఎక్కడ చూసినా, ఏ పేపర్ చదివినా  అన్యాయం,అక్రమం,దేశాన్ని ఎలా దోచుకోవాలి అనే అలోచన,లంచగొండితనం,విచ్చలవిడి శ్రంగారం,పవిత్రత అంటే నేటి పిల్లలకి అవగాహన లేకపోవడం,ప్రస్తుత సమాజపోకడ మీద అవగాహన లేకపోవడం,చదువుమీద శ్రద్దలేక కబుర్లతోకాలక్షేపానికే ఎక్కువ సమయం కేటాయించడం,జులాయిగా జల్సాగా తిరగాలనుకోవడంలాంటి విషయాలాకు ప్రాధాన్యం ఉంది.ఇలా ఎప్పుడూ  చెడు గురుంచి మత్రమే  మనపిల్లలకు మనము అన్నిరకాల మీడియాద్వారా చెబుతూ ఉంటే వారికి మంచి అంటే ఎలాఉంటుందో ఎలా తెలుస్తుంది,ఎవరు చెబుతారు? ప్రభుత్వ స్కూళ్లలో సరిపడా ఉపాద్యాయులు లేరు.ఉన్నా,మంచిని బొధించేవారు తక్కువ.ప్రయివేటు స్కూళ్ళు,కాలేజీల్లో పోటీ పరీక్షలకొరకు  విధ్యార్ధులను మరమనుషులుగా తయారు చేస్తున్నారే గానీ, మంచి ప్రవర్తన కలిగిన ఉత్తమవిద్యార్ధులను భావి భారత ఉత్తమ పౌరులను తయారుచేయడం లేదు.రాంకర్స్ ఉత్పత్తి జరుగుతున్నది,వ్యక్తిత్వ వికాసం అక్కడ జరగడంలేదు.కాబట్టి మనము మనవంతు బాధ్యతగా, మనశక్తికోలది,మనకున్నంతలో ,మనపరిధికి లోబడి, మన దేశానికి ఎంతోకొంత సేవచేద్దాం.మనపూర్వులు అలా చేయబట్టే ప్రస్తుతం మనము సుఖంగా ఉన్నాము.మనవాళ్ళు చేసిన త్యాగాలే నేడు మనం అనుభవించే సుఖాలు.అలాగే ఇప్పుడు అంత కాకపోయినా కొంతయినా మన దేశం కోసం మనంసేవ చేద్దాము.దానికి గాను మీరు చేయవలసిందల్లా ఒక్కటే.అది మీరు మీద్రుష్టికి వచ్హిన చెడును అరికట్టడానికి ప్రయత్నించండి.అరికట్టలేనప్పుడు పక్కకు తప్పుకొండి.చెడుని ఏపరిస్తుతుల్లోనూ ప్రొత్సహించవద్దు.మంచి పనులను సాధ్యమైనన్ని ఎక్కువ చేయండి.పంచిని మెచ్హుకోండి.మంచి పనులను చేసేవారిని మెచ్హుకొంటూ వారిని ఉత్సాహపరచండి.దానికోసం మొదటగా మనకి తెలియకుండా మనలో ఏమన్నా చెడు ఉన్నదేమో మీరు మిమ్మల్ని ఆత్మవిమర్శ చేసుకోండి.వేరేవాళ్ళు మన్లోని చెడుని చెప్పేలోపే మనము దానిని మనలోంచి తోలగించుకోవాలి.దానికి మీరు ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలపాటు ఆరోజు మీరు చేసిన పనులను గుర్తుతెచ్హుకోండి.అప్పుడు మీకే తెలుస్తుంది మీరు చేసిన పొరపాట్లు ఏమిటో.అప్పుడు మీకు ఇష్టమైన దేవుని మనస్పూర్తిగా ప్రార్ధించండి మరునాడు ఆ పొరపాట్లు జరగకుండా చూడమని.అలాచేస్తే తప్పక భగవంతుని దయతో మన మన్స్సులో వున్న చెడ్డ అలోచనలు తొలగిపోతాయి.ఆమరునాడు అనాడు చేసిన చెడ్డపనులను మళ్ళా చేయము.ఈ విధంగా మనల్ని మనము బాగు చేసుకొని ఆతరువాత మన సమాజాన్ని బాగుచేద్దాము.ఒకటి బాగా గుర్తుంచుకోండి "మన సమాజం బాగుంటేనే మనం,మన కుటుంబం,మన స్నేహితులు ,మనబంధువులు ఇలా అందరూవున్న దేశం బాగుంటుంది.సమాజం నాశనమైతే నష్టపోయేదీ మనమే.ఆవిషయం మనమందరము బాగా గుర్తుపెట్టుకోవాలి." అందుకే మచిసమాజస్థాపనకై మనముకూడా ఒక చేయివేద్దాము.పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మన దేశానికి ఇప్పుడు చాలా అవసరం .సరేనా .