21, మార్చి 2015, శనివారం

INFORMATION

1 2 3 4 5 6


7
The introduction of a Special Aeroplane  design.
మనవుడు పక్షిలాగా సులభంగా ఎగరడానికి ఎప్పటినుంచో ప్రయత్నించుతున్నాడు.వాటిలో భాగంగానే మన పూర్వీకులు అప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశంలొ ఎగరగలిగారు.ఆ విజ్ఞానం నేడు అందుబాటులో లేదు.భరద్వాజ మహర్షి ''వైమానికశాస్త్రం'' వ్రాశాడు.కానీ దానిలో ఉన్న సాంకేతికత మనకు అర్ధం గావడం లేదు.ఆ ప్రాచీన విజ్ఞానాన్ని నేటి వైజ్ఞానికతతో  ఆలోచిస్తే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి.అవే ప్రస్తుతము నేను చెప్పబోయేది.ఒక వస్తువుని గాలిలో ఎగిరించాలంటే దానికి కొన్ని ప్రయత్నాలు మనము చేయాలి.ముందుగా మనము కొన్ని  సంఘటనలను  విశ్లేషిద్దాము.పూర్వము కీలుగుర్రము,యాంత్రికపక్షి మొదలైన సాధనాలను మనవాళ్ళు ఆకాశంలోకి ఎగరడానికి ఉపయోగించేవారని వినికిడి.వాటి పరిజ్ఞానం నేడు దుర్లభం.కధలద్వారానే మనకు తెలుసు.కానీ అవి తప్పనిసరిగా ఉందేవని చెప్పవచ్హును. ఒక స్పెసిఫిక్ నేం ఉంటే తప్పక అవి ఉండేవని అర్ధం. సరే వాటిని అలా ఉంచితే ప్రస్తుతము మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్నాయి.వాటిని పరిశీలిద్దాము. కొన్ని రకాల విత్తనాలు వాటిచుట్టూ ఉన్న దూదివల్ల గాలిలో కొట్టుకు పోతూ వుండడాన్ని మనము చూస్తూ ఉంటాము.ఇక్కడ కొద్దిపాటిబరువు ఉన్న గింజ బాగాతేలిక ఐన దూదివల్ల గాలిలో తేలడం సాధ్యం.వడ్రంగి పిట్టని చూసి హెలీకాప్టర్ కనుగొన్నారు.మనము నివసించే భూమి తనకున్న గురుత్వాకర్షణ బలంవల్ల భూమిమీద ఉన్న ప్రతి వస్తువుని తనవైపుగా లాక్కుంటూ ఉంటుంది.చివరికి గాలిని గూడా తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. గంటకు వెయ్యి కిలో మీటర్ల వేగంతో, భూమి తనచుట్టూ ఉన్న గాలితోసహా తనచుట్టూ తాను నిత్యం తిరుగుతూ ఉంటుంది. అగ్నికి పైకి ప్రయాణించడము లక్షణము.నీటికి అడుగుకి పయనించడము సహజగుణము.వాయువుకు అడ్డంగా వీయడము దాని నైజము.అందువల్లనే సబ్ మెరీన్లు నీటిలో మునగాలంటే వాటిలో ఉన్న వాటర్ కంటైనర్లను నీటితో నింపడం వల్ల ఆ పని సాధ్యమౌతున్నది.జెల్లీ ఫిష్ లు పైన ఉన్న నీటిని కిందకు తోస్తూ అవి నీటిలో పైకి  కదులుతూ ఉంటాయి. మనము కూడా నీటిలో ఈదేటప్పుడు నీటిని వెనక్కి తోస్తూ  ముందుకి వెళ్తూ ఉంటాము.పక్షులు కూడా తమకున్న బలమైన రెక్కలతో గాలిని వెనక్కు తోస్తూ గాలిలో తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి.విమానాలు కూడా బెర్నౌలీ'స్ సూత్రం ఆధారంగా గాలిలో ఎగురుతున్నాయి.ఇక్కడ ఎక్కువ బరువుని బలమైన పక్షిరెక్కలు చేసే పనిని ప్రొఫెల్లర్స్ చేస్తున్నాయి.రెక్కల సాయంతో ముందుకు ఇవి ప్రయాణి స్తున్నాయి. గాలిలో తేలడానికి రెక్కలు,ముందుకు వెళ్ళడానికి ప్రొఫెల్లర్స్ పనికి వస్తున్నాయి.అంటే రెక్కలు ప్రొఫెల్లర్స్ ఉంటే బస్సుని కూడా ఆకాశంలోకి లేపవచ్హును.ఈరెండూ లేకుండా ఒక చిన్న  రాయిని కూడా మనము గాలిలో  తేలేట్లు చేయలేము.గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఒక కిలో గ్రాము వస్తువుని స్పేస్ లోకి తీసుకొని వెళ్ళడానికి ఒక టన్ను ఇంధనమును మండించాలి.అప్పుడే ఆ వస్తువుని స్పేస్ లోకి తీసుకొని వెళ్ళడము సాద్యమౌతుంది.గాలి బెలూన్లను మనము ఉపయోగించ వచ్హును.కానీ వాటిపైన మనకు కంట్రోల్ ఉండదు.ప్రమాదములు అధికము.బెర్లిన్ బెలూన్ దుర్ఘటన జరిగిన తరువాత జనాలు బెలూన్లు అంటే భయపడ్డారు.దాదాపు వెయ్యి మందితో ప్రయాణిస్తున్న బెలూన్,  బెర్లిన్ దగ్గర  ఉన్న హై వొల్టజ్ కరెంట్ తీగలమీద పడి అది తగలపడిపోయింది.దానిలోఉన్న వారిలో 600 వందలమంది కాలిపోయారు.ఆ దెబ్బతో బెలూన్లో ప్రయాణమంటే జనాలకు భయం పట్టుకుంది.అప్పటినుంచి బెలూన్లమీద ప్రయోగాలు చాలావరకు తగ్గాయి. మనము ఆకశంలోకి పూర్తి రక్షణతో ఇప్పటికీ సరిగా ఎగరలేక పోతున్నాము.అందుకనే రాజశేఖర రెడ్డి,బాలయోగి,సౌందర్య,క్రికెటర్ క్రాన్యె వంటి వారెందరో హెలీకాప్టర్ ప్రమాదాల్లో అసువులు కోల్పోయారు.అందుకనే అనుకుంటా మన పెద్దలు 'దైవాధీనం మోటర్ సర్వీసు ' అని అన్నారు. కనుక వీటన్నింటినీ ఆలోచిస్తే పూర్తి భద్రతతో తక్కువ ఖర్చుతో మనము ఆకాశంలోకి సులభంగా ప్రయాణించడము ఎంతో అవసరము.అది ఈ క్రిందివిధంగా విధంగా సాధ్యము.